TelanganaTourism:కొయ్యూరు అడవుల అందాలు ఇవే..

ఎటు చూసినా దట్టమైన అడవి.. భూమికి ఆకుపచ్చని రంగేసినట్టే కనిపిస్తుంది. ఆ పక్కనే మానేరు పరవళ్లు.. చట్టూ ఎత్తైన కొండలు ఇన్ని ప్రకృతి అందాల మధ్య చారిత్రక వైభవాన్ని చాటిచెప్పే నైన గుహలు ...గుళ్లు.   . వందల సంవత్సరాల నాటి ఈ గుహల గోడలపై ఉన్న అందమైన వర్ణచిత్రాలను ఎంతసేపు చూసినా తనివితీరదు. ఇలాంటి అద్భుతమైన ప్రదేశం  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరుకు దగ్గరలో ఉంది. వీకెండ్లో సరదాగా కాసేపు గడపాలంటే మీరూ ఓ లుక్కేయండి

మానేరు నది తీరంలో మన చరిత్రను ఉన్నాయి. అవన్నీ పడమటి ముఖం కలిగి ఉన్నాయి. ఒకే రాతి గుట్టలని  తొలిచి నాలుగు గుహలుగా మార్పారు.   ప్రతి ఆలయం గర్భగుడి ముందు అర్ధ మండపాలు, ఇరువైపులా  రెండు స్తంభాలు ఉన్నాయి,  మొదటి గుహలో శివలింగం, రెండో గుహలో మహిషానుర విగ్రహం. మూడోగుహలో లింగం, నాలుగో గుహలో వినాయకుడిని పోలిన విగ్రహం ఉన్నాయి. పాండవుల గుట్టలో మాదిరిగానే  గోడ పైభాగంలో అందమైన పాలియోలిథిక్ వర్ణ చిత్రాలు కనిపిస్తాయి.

చరిత్ర

ఇది సుమారు 10-11వ శతాబ్దాలకు చెందినవని  పురావస్తు శాఖ తెలిపిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ గుహలు జైనుల వసతి  గృహాలుగా ఉన్నాయి. అయితే వాటిని తర్వాత శివాలయాలుగా మార్పు చేసినట్లు తెలుస్తుంది. వీటిని కాకతీయ సామ్రాజ్యం తొలిదశలో నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. క్రీ. శ. 11 వ శతాబ్దంలో ముత్ర కూటం (మంథని) రాజ్యాన్ని పాలిస్తున్న గుండ రాజు రాజైన సన్యాసులు ఉండేందుకు దీన్ని కట్టించాడని స్థల పురాణం ద్వారా  తెలుస్తోంది. ఇది చాలాకాలంపాటు విడిది కేంద్రంగా విలసిల్లినట్లు చరిత్ర చెప్పుంది. ఈ గుహల పైభాగంలో నవని సున్నపు పొరలున్నాయి. వాటిపై రకరకాల వర్ణచిత్రాలు కనిపిస్తున్నాయి.

క్రీ.శ. 1138లో కాకతీయ ప్రభువైన రెండో పోలరాజు రాజ్య విస్తరణలో భాగంగా  మంత్రకూటం రాజైన గుండరాజుపై దండెత్తాడు. ఈ భీకర  యుద్ధంలో వేలాది మంది సైనికులకు గాయాలయ్యాయి.  అదే టైంలో  ఇక్కడున్న ప్రముఖ జైన ఆయుర్వేద వైద్యుడు అగ్గళయ్య సైనికులుకు వైద్యం చేసేందుకు ఈ గుహలను హాస్పటల్​గా మార్చాడు. అప్పటి నుంచి చుట్టు గ్రామాల ప్రజలకు  కూడా ఏ రోగమొచ్చినా ఇక్కడికే వచ్చే వాళ్లు.  అందుకే  వాటిని రోగాలను నయం చేసే గుళ్లుగా  పిలిచేవాళ్లు.   అదే వ్యవహారిక భాషలో "నైన గుళ్లు'గా మారింది. గహాలయాల గోడల మీద రెండు లఘు శాసనాలు తెలుగు భాషలో చెక్కిన రెండు చిన్న లేబుల్ శాసనాలున్నాయి. 

గుహల గోడలపై ఉన్న వర్ణచిత్రాల్లో నర్తకియుద్ధ సన్నివేశాలు గుర్రపు రథాలు బాణం పట్టుకున్న సైనికులు, రాజభవనాలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ చిత్రాలు పొరలు, కాలక్రమేణ ఊడిపోయి ప్రస్తుతం నలువు.. ఎరుపు, నీలం, పసుపు పచ్చని రంగుల్లో కనిపిస్తున్నాయి. కొన్ని అస్పష్టమైన గుర్తులుగా మిగిలాయి. గీసిన రాతి భాగం నాణ్యమైన శిల కాకపోవడం. శతాబ్దాల తరబడి మానేరు నది నుంచి వీచే గాలులకు  ఈ చిత్రాలు వాటి రూపుని కోల్పోతున్నాయి. ఈ చిత్రాలు భూపాలపల్లి జిల్లా తిరుమలగిరి సమీపంలో పాండవులగుట్టలోని వర్ణచిత్రాల కంటే ప్రాచీనమైనవి. వాటి రంగుల గాఢత  చిత్రించిన శైలి మనకు అజంతా చిత్రాలను గుర్తుకు తెస్తున్నాయి. 

ఎండాకాలంలో కూడా ఇక్కడ నీరు ఎండిపోదు..

నైనగుళ్లలో మహాశివరాత్రి, శ్రీరామనవమి వేడుకలను అంగరంగవైభవంగా వేస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే. ఈ గుహాలయం పక్కన మానేరు నదిలో మండు వేసవిలో కూడా ఎండిపోని పెద్ద మడుగులు ఉన్నాయి. ఇంతటి అపురూపమైన చరిత్ర కలిగిన నైనగుళ్లను ఫారెస్టు అధికారులు, పురావస్తు పరిశోధకులు అనేకసార్లు  పరిశీలించి అప్పటి జిల్లా కలెక్టర్ అనుయ్ కుమార్ కు నివేదిక అందించారు. జిల్లా కలెక్టర్, పారెస్టు అధికారులు.. పురావస్తుశాఖ అధికారులు నైనగుళ్లలో టూరిస్టుల కోసం దారి ఏర్పాటు చేసి, కరంట్, తాగునీరు వంటి మౌలిక వసతులను కల్పిస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు.

పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలి..

అతిపురాతనమైన చారిత్రక సాంస్కృతిక వారసత్వ సువలైన వైనగుర్లను ప్రభుత్వం, పురావస్తుశాఖ పరిరక్షించాలి. ఇంతటి చారిత్రక పురావస్తుశాఖ ప్రచారం చేయాలి. మానేరులో బోటింగ్ బూస్టులు ఏర్పాటు చేస్తే తెలంగాణలో మరో పర్యాటక కేంద్రం రూపుదిద్దుకునే అవకాశం ఉంది.